నాగినేనికి నామినేట్ పదవి వరించనుందా...

నాగినేనికి నామినేట్ పదవి వరించనుందా...

ముద్ర ముత్తారం: నాగినేని కి నామినేట్ పదవి వరించనుందా అంటే.... అవుననే ప్రచారం విసృతంగా జరుగుతుంది... నాగినెని జగన్మోహన్ రావు మంథని నియోజక వర్గంలో ఈ పేరు తెలియని వాళ్ళు లేరు అంటే ఆదిశక్తి కాదు... ముత్తారం మండల కేంద్రానికి చెందిన నాగినేని  ముత్తారం సర్పంచ్ గా... ఆ తర్వాత ఎంపీపీగా మాజీ నక్సలైట్స్ జడల నాగరాజు పై విరోచితంగా పోరాడి ఎవరు ఊహించని విధంగా ఎంపీపీ పదవి దక్కించుకున్నాడు. ఆ తర్వాత జరిగిన జడ్పిటిసి ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ పై విజయం సాధించి జడ్పీటీసీగా అధిక మెజారిటీతో గెలిచారు. 2009 ఎన్నికల్లో నాగినేని కి మంథని ఎమ్మెల్యేగా టిడిపి టికెట్ వస్తుందని విస్తృతంగా ప్రచారం కూడా సాగింది... కానీ అప్పటి పెద్దపల్లి ఎంపీ సుగుణ కుమారి మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి కి ఇటు నాగినేని కాకుండా గోదావరిఖని చెందిన మాజీ ఎమ్మెల్యే సోమవారపు సత్యనారాయణ కు మంథని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా... నాగినేని రాజకీయం ఒక్కసారి గా ప్రశ్నార్థకంగా మారిపోయింది.  

అయినప్పటికీ ఆయన మొక్కుబోని పట్టుదలతో తనదైన ముద్రతో రాజకీయాల్లో రాణిస్తూ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నారు. 2014 లో  తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి బాధితులు చేపట్టినప్పటికీ నాగినేని మాత్రం అంటి ముట్టనట్టుగానే వ్యవహరించారు. అప్పటి ఎన్నికల్లో పుట్ట మధు ఎమ్మెల్యే గా గెలిచినప్పటికీ నాగినేని మాత్రం ఆయన చెంతకు చేరలేదు. పుట్ట మధు పైన రెండు ఎన్నికలలో పోరాటం చేశారు. నాగిని శ్రీధర్ బాబుకు మద్దతు ఇచ్చి ఆయన గెలుపులో భాగమైనాడు.  గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి శ్రీధర్ బాబు గెలుపు కోసం విస్తృతంగా పనిచేశాడు. ముత్తారం మండలంలోనే కాకుండా మంథని నియోజక వర్గం లో ఆయనకున్న పరిచయాలతో శ్రీధర్ బాబు గెలుపులో తాను ఒక సైనికుడిలా పని చేశారు... దీంతో నాగినేని వైపు కాంగ్రెస్ అధిష్టానం చూస్తుందని ప్రచారం జరుగుతుంది. నాగినేనికి ఏదైనా నామినేట్ పదవి అప్పజెప్పి,  మంథధి నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ ని మరింత బలపరిచేందుకు ఉపయోగించుకోవాలని చూస్తుందని తెలుస్తుంది. కానీ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాగినేని నామినేటెడ్ పదవి ఇచ్చి ఆయన సేవలు పార్టీకి ప్రజలకు ఉపయోగించుకునేలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.  నాగినేనికి నామినేటి పదవి అప్పజెప్పి తే ఆయన మరింత దూకుడుగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు.