జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ.

జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ.
  • ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆంక్షలు కొనసాగుతాయి.
  • ఎవ్వరూ చట్టఉల్లంఘన చర్యలకు పాల్పడవద్దు.
  • ఎస్పీ రాహుల్ హెగ్డే 

ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన రోజు నుండి ఇప్పడివరకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ట ప్రణాలికతో పని చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లాలో ఎన్నికలకు రక్షణ బందోబస్తు కల్పించాం అని, ప్రశాంతంగా నిర్వహించాం అని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపినారు. ఎన్నికల కౌంటింగ్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలక్టర్ వెంకట్రావుతో కలిసి పర్యవేక్షణ చేసినారు. ఎస్పీ  మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖకు సహకరించిన ఓటర్లకు, ఉద్యోగులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అని ఎన్నికల బందోబస్తులో అనునిత్యం శ్రమించి పని చేసిన జిల్లా పోలీసు సిబ్బందిని అభినందిస్తున్నాను అని అన్నారు.

ఎన్నికలు, ఎన్నికల లెక్కింపు అంతా ప్రశాంతంగా జరిగాయనీ ,ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జిల్లాలో  ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఆంక్షలు కొనసాగుతాయనీ ,నిఘా, పెట్రోలింగ్, తనిఖీలు కొనసాగిస్తాం అని ఎస్పీ  అన్నారు. ఎవ్వరూ కూడా చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడవద్దు అని ఎస్పీ  కోరినారు.