గంజాయి ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు..

గంజాయి ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు..

గొల్లపల్లిమండల పోలీసులు తనిఖీలో భాగంగా చిల్వా కొండూరు వద్ద శుక్రవారం వాహనాలు తనిఖీ చేపట్టగా ఇద్దరు యువకులు గంజాయి చారస్ తో పట్టుపడ్డారని 
డి ఎస్పీ రఘు చందర్ తెలిపారు
గొల్లపల్లి. ముద్ర: యువకులను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు.గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న గొల్లపల్లి మండల పోలీసుల తనిఖీల్లో భాగంగా చిల్వకోడూర్ వద్ద శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టగా ఇద్దరు యువకుల వద్ద గంజాయి, చారస్ పట్టుబడటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రఘు చందర్ తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల రూరల్ మండలం బాలపెల్లి కి చెందిన మారంపల్లి లక్ష్మణ్, గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన దొమ్మాటి కార్తీక్ అనే ఇరువురు యువకులు గంజాయికి అలవాటు పడి తక్కువ మొత్తానికి గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతూసొమ్ము చేసుకుంటూ జల్సాలకు అలవాటు పడ్డారు.అదే క్రమంలో ఒరిస్సా నుంచి గంజాయి కొనుగోలు చేసి మొత్తాన్ని తరలిస్తుండగా  పోలీసులు పెట్టుకున్నారు.

పెగడపల్లి మండలానికి చెందిన అజయ్,ఒడిస్సాకి చెందిన నూకరాజు అనే ఇరువురు పరారీలో ఉన్నారని తెలిపారు. పట్టుబడిన యువకుల నుంచి ఒక పల్సర్ బైక్, నెం.TS 11 ES 9312 గా రెండు సెల్ ఫోన్లు 13.24 కిలోల గంజాయి,40 గ్రాముల చరస్ స్వాధీనం చేసుకున్నట్లు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రెండున్నర లక్షల దాకా ఉంటుందని తెలిపారు.గంజాయి ముఠా ను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన డీఎస్పీ రఘు చందర్, నోడల్ అధికారి వెంకటేశ్వర్లు,ధర్మపురి సీఐ నరసింహ రెడ్డి, ఎస్సె సతీష్, పోలీస్ సిబ్బంది వేణు,హలీం,లక్ష్మణ్,రమేష్, లను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.