అయోధ్య రామయ్య వారికి వెండి కిరీటం, పట్టువస్త్రాలు సమర్పించిన ప్రధాని మోదీ

అయోధ్య రామయ్య వారికి వెండి కిరీటం, పట్టువస్త్రాలు సమర్పించిన ప్రధాని మోదీ

ముద్ర,సెంట్రల్ డెస్క్:- రామజన్మభూమి అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి హారతి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌తో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.దివ్యమైన రూపంతో భక్తులకు శ్రీరాముడు దర్శనమిచ్చాడు. రాముడిని చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదని భక్తులు చెబుతున్నారు.