నేటి నుంచి రామ దర్శనం 

నేటి నుంచి రామ దర్శనం 
  • రోజూ రెండుసార్లు హారతి 

అయోధ్య : అయోధ్య రాముడు నేటి నుంచి(జనవరి 23)  భక్తులకు దర్శనమివ్వనున్నాడు. సోమవారం జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశం నుంచి వేల సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి భక్తులు రామ దర్శనం చేసుకోవాలని రామ మందిర తీర్థ క్షేత్ర కమిటీ తెలిపింది. ఈసందర్భంగా రామ్​లల్లా హారతి సమయాలను వెల్లడించింది.  ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు భక్తులు శ్రీరాముడి విగ్రహ దర్శనానికి అవకాశం కల్పించారు. దీని తర్వాత కొన్ని గంటలపాటు గర్భగుడి తలుపులు మూసి ఉంచుతారు. మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు తలుపులు తెరుస్తారు. గర్భగుడిలో రోజూ రెండుసార్లు హారతి నిర్వహిస్తారు. ఉదయం 6.30 గంటలకు, సాయంత్రం 7.30 గంటలకు ఈ హారతి ఇస్తారు. హారతి సమయంలో సాధారణ ప్రజలను ఆలయంలోకి అనుమతించరు. ఏ భక్తుడైనా హారతి దర్శనం చేసుకోవాలనుకుంటే వారు ప్రత్యేక పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్‌లను తీర్థయాత్ర వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో పొందవచ్చు.