బిఅర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి రేసులో రావుల రమేష్

బిఅర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి రేసులో రావుల రమేష్

తిమ్మాపూర్ ముద్ర :బిఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పై అధిష్టానం దృష్టి సారించింది.

కరీంనగర్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి రేసులో తిమ్మాపూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేష్ పోటీ పడుతున్నారు. తెలంగాణ ఉద్యమం సమయం నుండి స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ నికార్సైన ఉద్యమ నేతగా కొనసాగుతున్నారు. ప్రజలతో మమేకమవుతూ కెసిఆర్ సూచించిన ఉద్యమాలకు బాసటగా నిలిచారు. మానకొండూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వెన్నంటి ఉంటూ అతని గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. యువతలో ఫాలోయింగ్ ఉండడం అతనికి కలిసివచ్చే అంశం. జిల్లా వ్యాప్తంగా సత్సంబంధాలు కలిగి ఉండడం రావుల రమేష్ వంటి నేత జిల్లా అధ్యక్షుడు అయితే పార్టీ జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. రావుల రమేష్ ను అధ్యక్షుడిగా చేయడానికి రసమయి బాలకిషన్ తో పాటు ఓ ఎమ్మెల్యే మరో ఇద్దరు ప్రముఖులు పావులు కదుపుతున్నట్లు చర్చ నడుస్తుంది.