పెద్దపల్లిలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

పెద్దపల్లిలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
  • 51 గంజాయి చాక్లెట్స్ స్వాధీనం
  • పెద్దపల్లి ఎస్ఐ మల్లేష్


ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దపల్లి పట్టణం అమర్ నగర్ లోని వెల్డింగ్ షాప్ లో పనిచేసే వ్యక్తి గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్నాడనే నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి ఎస్ఐ మల్లేష్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు అమర్ నగర్ లో అనుమానస్పదంగా ఒక వ్యక్తి కనపడగా అతన్ని తనిఖీ చేయగా, గంజాయి చాక్లెట్స్ లు లభించాయని, అనంతరం అతడిని విచారించగ అతని పేరు అర్సలన్ అన్సారీ  (22)ముస్లిం, వెల్డింగ్ వర్క్, అమర్ నగర్, పెద్దపల్లి అని తెలిపాడని, చెడు అలవాట్లకు, గంజాయి కి బానిసై అతను గంజాయి చాక్లేట్స్ తాను తినడం కోసం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదగించాలనే దురుదేశ్యంతో ఉత్తర ప్రదేశ్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి చాక్లెట్స్ కొనుగోలు చేసి పెద్దపల్లి  ప్రాంతంలోని అమాయకపు స్టూడెంట్స్, యువత కి ఎక్కువ ధరకు అమ్ముతానని తెలపాడని, నిందితున్ని అతని వద్ద లభించిన గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కోసం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించామన్నారు. నిందితుడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడని,  తదుపరి విచారణ కోసం తెలంగాణ ఆంటీ నట్రాటిక్స్ బ్యూరో టిఎస్ ఎన్ ఏబి కి వివరాలు పంపమని ఎస్ఐ తెలిపారు.