అంతరాలులేని సమాన విద్యనందించడం ప్రభుత్వాల బాధ్యత

అంతరాలులేని సమాన విద్యనందించడం ప్రభుత్వాల బాధ్యత
  • టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
  • టీచర్ల ఖాళీలు భర్తీ చేయాలి
  • ఫిబ్రవరిలో మహాసభలు
  • టిపిటిఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండల్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: అంతరాలు లేని సమాన విద్యను అందించడం ప్రభుత్వాల బాధ్యత అని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని టిఫిటిఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు సంగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా  మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తే కార్పొరేట్ తరహా విద్యను అందించేందుకు టీచర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. పాఠశాలలో సరైన వసతులు లేకపోవడంతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందరం లేదని వాపోయారు. టీచర్ల బదిలీలు పదోన్నతుల్లో జాప్యం చేయకుండా  ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. టీచర్ల ఖాళీల భర్తీ కోసం నిరుద్యోగ యువత వేయికళ్లతో ఎదురుచూస్తుందని, వెంటనే ఖాళీల భర్తీ కోసం చర్యలు చేపట్టాలని  డిమాండ్ చేశారు. ఎన్సిఈఆర్టీలో అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

పెండింగ్లో ఉన్న మూడు డీఏలను, ఇతర పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన జిపిఎఫ్ ను వెంటనే మంజూరు చేయాలన్నారు. స్కావెంజర్ లేక అన్ని పాఠశాలలో టీచర్లు అనేక అవస్థలు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి  వెంటనే స్కావేంజర్ లను నియమించాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో నెలకొన్న ఉపాధ్యాయుల సమస్యలపై ఫిబ్రవరి 4న జిల్లా కేంద్రంలో జిల్లా మహాసభలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం 11,12 తేదీల్లో ఖమ్మం పట్టణంలో టిపిటిఎఫ్ రాష్ట్రస్థాయి విద్య, వైజ్ఞానిక రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలో  రెండు రోజులపాటు ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించి భవిష్యత్తు  కార్యచరణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర మహాసభల్లో  డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క  రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క,  ప్రొఫెసర్ కోదండరాంలతో పాటు వివిధ ప్రజా సంఘాల రాష్ట్ర నేతలు, విద్యాశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు అతిథులుగా పాల్గొంటారని  వారు తెలిపారు. జిల్లా, రాష్ట్ర మహాసభల్లో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభలకు సంబంధించిన  వాల్ పోస్టర్లను టిపిటిఎఫ్ జిల్లా నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆడిట్ కమిటి కన్వీనర్ కొంగోటి యాదగిరి, ఉపాద్యాయదర్శిని ఎడిటర్ శశిధర్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు రామచంద్ర రెడ్డి,రాజయ్య,యాదగిరి, భాగ్యలక్ష్మి, నజీర్,యాదగిరి,గోపాల్, విఠల్ రెడ్డి,కొమ్మ శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, ఫణీంద్ర రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు హీరా లాల్, మధు సుదాన్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, సత్య నారాయణ,సంగీత తదితరులు పాల్గొన్నారు.