మెదక్ లో బిజెపి రాస్తారోకో

మెదక్ లో బిజెపి రాస్తారోకో

ముద్ర ప్రతినిధి, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెదక్లో గురువారం రాస్తారోకో నిర్వహించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం లీకేజీ, ప్యాకేజీ లక్ష్యంగా వ్యవహరిస్తుందని శ్రీనివాస్ విమర్శించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం గురివింద గింజ తన నలుపు ఎరగనట్టుగా చేస్తున్న లీకేజీ,  లిక్కర్ వ్యవహారాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీని అక్రమంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్  మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో మునుగోడు ఎలక్షన్ సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందన్న భయంతో ఫామౌజ్ కేసును అక్రమంగా బనాయించారు. ఇప్పుడు కూడా అదే రీతిలో ప్రశ్నాపత్రాల లీకేజీని బిఆర్ఎస్ పార్టీ దేశంలోని ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకోవడానికి ఆయా పార్టీలకు ప్యాకేజీల రూపంలో విపరీతంగా డబ్బులు అందిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును కాజేస్తూ ఇతర పార్టీల మద్దతు పొందడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, సంఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని,  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోలో గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ ఎక్కల దేవి మధు, నందారెడ్డి, తాళ్లపల్లి రాజశేఖర్, చోళ పవన్, నాయిని ప్రసాద్,  ఆకుల ప్రభాకర్, రంజిత్ రెడ్డి, బక్కవారి శివ, కల్కి నాగరాజు,  యువ మోర్చా ప్రధాన కార్యదర్శి సతీష్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాజు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.