Telugu Student Death In USA: అమెరికాలో మధిర యువకుడి మృతి: పొరపాట పేలిన తుపాకీ

Telugu Student Death In USA: అమెరికాలో మధిర యువకుడి మృతి: పొరపాట పేలిన తుపాకీ
Gun Miss Firing

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: జిల్లా లోని మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్ సాయి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఏడాది కిందట అమెరికా వెళ్ళాడు. అలబామాలోని అబర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. పాకెట్ మనీ కోసం ఓ గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అక్కడ సెక్యూరిటీ గార్డ్ వద్ద ఉన్న తుపాకిని పరిశీలిస్తుండగా అది పొరపాటున పేలింది. అత్యంత సమీపం నుంచి తుపాకీ పేలడంతో బుల్లెట్ అఖిల్ సాయి తలను చిద్రం చేసింది.

గ్యాస్ స్టేషన్ సిబ్బంది అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందు మరణించాడు. అఖిల్ సాయి మరణంతో మదిలోని అతని కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాన్ని భారత రప్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించి కొడుకు చివరి చూపు కైనా సహకరించాలని యువకుని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.