గులాబీ దళంలో టెన్షన్‌

గులాబీ దళంలో టెన్షన్‌

 గులాబీ దళంలో టెన్షన్‌

మేడ్చల్‌ జిల్లా గులాబీ దళంలో టెన్షన్‌ నెలకొంది. మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లపై కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అవిశ్వాస బాణాన్ని వదులుతున్నారు. అసంతృప్తులంతా ఒక్కటై వారిని పదవుల నుంచి దించేందుకు పావులు కదుపుతున్నారట. ఈ చర్యల వెనుక జిల్లా మినిస్టర్‌ ఉన్నారని చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతం ఈ అంశం రచ్చ రచ్చ అవుతోంది.మేడ్చల్‌ జిల్లాలోని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలోని ఃఖీూ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇటీవల కాలంలో వారిపై సొంత పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్నారని.. తమ డివిజన్లు, వార్డులను పట్టించుకోవడం లేదని నిరసనలు చేపడుతున్నారు.

దీంతో తమను ఈ సమస్య నుంచి గట్టెక్కించాలని బాధిత మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు జిల్లా మంత్రి మల్లారెడ్డికి మొర పెట్టుకున్నారట. ప్రతి రోజూ మంత్రి క్యాంపు కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.మూడేళ్ల క్రితం తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. మేడ్చల్‌ జిల్లాలో నాలుగు కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపల్‌ చైర్మన్లను అధికారపార్టీ కైవశం చేసుకుంది. అక్కడక్కడా గెలుపొందిన కాంగ్రెస్‌, బీజేపీ, ఇండిపెండెంట్లు కూడా గులాబీ గూటికి చేరారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడిరది. ఉన్నట్టుండి సొంత పార్టీ నేతలే మేయర్లు, ఛైర్మన్లపై తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. జవహర్‌ నగర్‌ మేయర్‌ కావ్య, మేడ్చల్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ దీపికారెడ్డి ఈ జాబితాలో ఉన్నారు. మేయర్‌ కావ్యకు వ్యతిరేకంగా 20 మంది కార్పొరేటర్లు ఎకమయ్యారు. పిర్జాదిగూడ మేయర్‌ వెంకటరెడ్డి, బోడుప్పల్‌ మేయర్‌ బుచ్చిరెడ్డిలదీ ఇదే పరిస్థితి.పిర్జాదిగూడలో డిప్యూటీ మేయర్‌ శివకుమార్‌తో కలిసి అసమ్మతి కార్పొరేటర్లు అర్దనగ్న ప్రదర్శన చేయడంతో అధికారపార్టీ శిబిరంలో కలకలం రేగింది. సొంతపార్టీ కార్పొరేటర్లే మేయర్లపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడీ సమస్య దమ్మాయిగూడ, నాగారం, ఘటకేసర్‌, గుండ్ల పోచంపల్లి, నిజాంపేట పురపాలికలకు పాకినట్టు చెబుతున్నారు.

అయితే ఒక్క మేడ్చల్‌ జిల్లాలోనే ఈ తరహా ఆందోళనలు చెలరేగడం వెనుక ఏదో కుట్ర ఉందని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయట. బాధిత మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లు మంత్రి మల్లారెడ్డిని ఆశ్రయిస్తున్నా.. ఈ సమస్య రావడానికి ఆయన కూడా కారణమై ఉండొచ్చనే చర్చ సాగుతోంది. మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లుగా ఉన్నవారు మంత్రి మాట వినడం లేదట. పైగా పార్టీ కార్యక్రమాలకు పైసలు తీయడం లేదట. దీంతో వారికి రaలక్‌ ఇవ్వడానికే మల్లారెడ్డి తెరవెనుక నాటకం ఆడుతున్నారనేది కొందరి అనుమానం.మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లగా ఉన్నవారితో రాజీనామా చేయించే ఎత్తుగడ ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటం.. మరో వర్గాన్ని సిద్ధం చేసుకునే ఎత్తుగడ అయిఉండొచ్చని అనుకుంటున్నారట. ఇప్పటికే మంత్రిని ఆశ్రయించిన మేయర్లు, ఛైర్మన్లు.. విషయం తెలుసుకుని కంగుతింటున్నట్టు సమాచారం. మరి.. అసలు లొగుట్టు ఎప్పుడు బయట పడుతుందో చూడాలి.