కర్నాటక సీఎం ఎవరనేది హైకమాండ్​ నిర్ణయం తీసుకుంటుంది

కర్నాటక సీఎం ఎవరనేది హైకమాండ్​ నిర్ణయం తీసుకుంటుంది

కర్నాటక సీఎం పదవిపై మద్దతుదారులతో చర్చించిన  కాంగ్రెసు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్​. సీఎం ఎవరనేది హైకమాండ్​ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. పీసీసీ చీఫ్​గా 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానని అన్నారు. పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు. 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ధైర్యం కోల్పోలేదని చెప్పారు.

పార్టీ నేతలను ఏకతాటిపైకి తెచ్చానని చెప్పారు. తాను ఒంటరిగానే పార్టీని గెలిపించుకున్నానన్నారు. సోనియా, రాహుల్​, ఖర్గే సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తన మద్దతుదారుల సంఖ్య ఇంతని చెప్పనని అన్నారు. మా సంఖ్య అంతా కాంగ్రెస్​ సంఖ్యే అన్నారు.