ఓటు హక్కు అందరి బాధ్యత

ఓటు హక్కు అందరి బాధ్యత

స్వీప్ జిల్లా  అసిస్టెంట్ ఎన్నికల అధికారి మదన్ మోహన్


ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ఓటు హక్కు అందరి బాధ్యతగా గుర్తించాలని స్వీప్ జిల్లా అసిస్టెంట్ ఎన్నికల అధికారి మదన్ మోహన్ అన్నారు. శుక్రవారం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం సమావేశ హాలు లో సీనియర్ సిటిజెన్లకు లోక సభ ఎన్నికల  సందర్భంగా ఓటింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా  గత అసెంబ్లీ ఎన్నికల్లో  వయోధికులకు  ఓటు హక్కు అవగాహన  కల్పించిన, వృద్ధుల సంరక్షణ కేసుల పరిష్కారం కోసం కృషి చేసిన 36 మంది సీనియర్ సిటిజీన్స్ ప్రతినిధులను అధికారులు  సన్మానించారు. అనంతరం స్వీప్ అసిస్టెంట్ జిల్లా అధికారి   మాట్లాడుతూ సమాజంలో ఓటు ప్రాధాన్యత తెలుపాల్సిన బాధ్యత సీనియర్ సిటిజెన్లపై ఉందన్నారు.రానున్న ఎన్నికల్లో 85 ఏళ్లు నిండిన వయోధికులకు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం ఎన్నికల కమిషన్ కల్పించిందని,వారు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ప్రతినిధులు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి బి వాణిశ్రీ,సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివా నందం,మెట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు ఓజ్జల బుచ్చిరెడ్డి,జగిత్యాల అధ్యక్షుడు పి.సతీశ్ రాజ్,వి ఫీల్డ్ అధికారి కొండయ్య,సూపరెండేంట్ చంద్రమోహన్,వివిద మండలాల,గ్రామాల సీనియర్ సిటీజేన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు