ఘనంగా రంజాన్ వేడుకలు

ఘనంగా రంజాన్ వేడుకలు

ముద్ర, మల్యాల: రంజాన్ పర్వదిన వేడుకలు శనివారం మల్యాల మండలంలో ముస్లీమ్ కుటుంబాలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం రోడ్డు ఐవతల గ్రామాలకు చెందిన ముస్లీమ్ సోదరులు బ్లాక్ చౌరస్తా సమీపంలో గల ఈద్గా వద్ద, రోడ్డు అవతలి గ్రామాలకు చెందిన వారు రామన్నపేట లోని ఈద్గా వద్ద ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు( ఈద్ ముబారక్) తెలుపుకున్నారు. మండల ప్రజాప్రతినిధులు ముస్లీమ్ సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.