Amit Shah video morphing case - అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో ముగ్గురు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ అరెస్ట్

Amit Shah video morphing case - అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో ముగ్గురు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ అరెస్ట్

ముద్ర,తెలంగాణ:- రాష్ట్ర రాజకీయాల్లో అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి, సహా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.తాజాగా.. ఇవాళ‌ ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయడం కలకలం రేపింది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ సతీష్‌తో పాటు నవీన్, తస్లీమాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.