MLC By Election Notification Released - ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

MLC By Election Notification Released - ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

ముద్ర,తెలంగాణ:- తెలంగాణ‌లోని వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. దీంతో నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. ఈ నెల 27న పోలింగ్‌ నిర్వహిస్తారు. జూన్‌ 5న ఓట్లు లెక్కించనున్నారు.ఈ ఉపఎన్నికకు నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది. అభ్యర్థులు నల్లగొండ కలెక్టరేట్‌లో నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.