Turkey Earthquake Update: టర్కీ భూకంపం: 50 వేలు దాటిన మ‌ర‌ణాలు

Turkey Earthquake Update: టర్కీ భూకంపం: 50 వేలు దాటిన మ‌ర‌ణాలు
Turkey Earthquake Update

ట‌ర్కీలో వ‌రుస‌ భూ ప్రకంపనల  కార‌ణంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. భూకంప మ‌ర‌ణాలు ఇప్పటికే  50 వేల మార్కును దాటాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. సిరియా ప్రాణాన‌ష్టం కాస్త త‌క్కువ‌గానే ఉన్నప్పటికీ  ట‌ర్కీలో మాత్రం గ‌తంలో ఎన్నడూ లేని విధంగా ఈ భూ ప్రకంపనలు  ప్రాణ, ఆస్తి న‌ష్టాన్ని క‌లిగించాయి. 

ఫిబ్రవరి 6న టర్కీ, సిరియా ప్రాంతాల్లో సంభవించిన భూకంపం కార‌ణంగా మృతుల సంఖ్య శుక్రవారం నాటికి 50,000 దాటింది, టర్కీలో 44,000 మందికి పైగా మరణించినట్లు అధికారిక వ‌ర్గాలు ప్రకటించాయి. టర్కీలో భూకంపాల కారణంగా మరణించిన వారి సంఖ్య శుక్రవారం రాత్రికి 44,218కి పెరిగిందని డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ (AFAD) తెలిపింది. సిరియా తాజాగా ప్రకటించిన మరణాల సంఖ్య 5,914కు చేరుకుంది. దీంతో రెండు దేశాలలో కలిపి భూకంప మరణాల సంఖ్య 50 వేల మార్కును అధిగ‌మించింది.