గ్రామపంచాయతీ ట్రాక్టర్ తో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న సర్పంచ్

గ్రామపంచాయతీ ట్రాక్టర్ తో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న సర్పంచ్
Undavelli Mandal Kalugutla Gram Panchayat Illegal transportation of sand by tractor

జోగులాంబ గద్వాల ముద్ర ప్రతినిధి: ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా అక్రమ ఇసుక రవాణా చేస్తూ మూడు పూలు ఆరు కాయలుగా జేబులు నింపుకుంటున్న గ్రామ సర్పంచ్. పట్టించుకోని అధికారులు. గ్రామ పంచాయతీ కోసం ట్రాక్టర్లు కేటాయిస్తే వారు ఇసుక అక్రమ రవాణా  చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని గతంలో కూడా ఈ ట్రాక్టర్ పై  ఉండవెల్లి పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నట్టు కూడా గ్రామస్తులు చర్చించు కుంటున్నారు. ఇలాంటి గ్రామ సర్పంచ్ పై జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని  కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు మండి పడుతున్నారు.