ఘనంగా మహాశివరాత్రి  వేడుకలు..

ఘనంగా మహాశివరాత్రి  వేడుకలు..
Mahashivratri Celebrations
  •  శివనామస్మరణతో మారు మ్రోగిన శైవ క్షేత్రాలు
  •  కన్నుల పండుగగా శ్రీ పచ్చల కట్ట సోమేశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణం
  •  ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు  సమర్పించిన ఎమ్మెల్యే  పైళ్ల  శేఖర్ రెడ్డి

 భువనగిరి ముద్ర ప్రతినిధి: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం శివనామస్మరణలతో మండలం, పట్టణంలోని శివాలయాలు మారుమ్రోగాయి. భక్తులు ఉదయం నుండే ఆలయాలకు పోటెత్తారు. పట్టణంలోని శ్రీ పచ్చల కట్ట సోమేశ్వరాలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల  శేఖర్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించగా అర్చకులు నాగరాజు శర్మ  భక్తుల  కరకర ద్వానాల మధ్య కళ్యాణ తంతు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కాలేరు లక్ష్మణ్, వార్డు కౌన్సిలర్ లక్ష్మీ సతీష్, భక్తులు పాల్గొన్నారు.

 పలు ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పట్టణంలోని శివాలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని ధోబివాడలో గల దక్షిణేశ్వర,  భవాని రామలింగేశ్వర స్వామి ఆలయాలలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు జరిపారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవీ కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు రక్తం పురం బలరాం, పంగరెక్క  స్వామి, బిఆర్ఎస్ నాయకులున్నారు.