ఉత్తమ్ మంత్రి పదవిలో మార్పు

ఉత్తమ్ మంత్రి పదవిలో మార్పు
  • నల్లగొండ ఎంపీగా ఉత్తమ్ రాజీనామా

హుజూర్ నగర్ ముద్ర:కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండోసారి మంత్రి పదవి దక్కింది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేయడం విధితమే.మొదట కాంగ్రెస్ అధిష్టానం ఉత్తంకుమార్ రెడ్డిని హోంశాఖ మంత్రిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ క్యాబినెట్ కూర్పు సందర్భంగా జరిగిన చర్చలో ఉత్తమ్ కి కేటాయిస్తారనుకున్న హోం శాఖను మార్చటం జరిగింది.

సీఎం రేవంత్ రెడ్డి హోం శాఖను తన వద్ద ఉంచుకొని నీటిపారుదల(ఇరిగేషన్) ,క్యాడ్ , ఫుడ్ ,పౌరసరఫరాల(సివిల్ సప్లై) శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. తనని రెండోసారి మంత్రి పదవితో గౌరవించిన కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తమ్ ధన్యవాదాలు తెలిపారు. ఉత్తమ్ కి రెండవసారి మంత్రి పదవి దక్కడంతో హుజూర్ నగర్ ,కోదాడ నియోజకవర్గాల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తాను ప్రస్తుతం కొనసాగుతున్న నల్లగొండ ఎంపీ పదవికి ఉత్తమ్ రాజీనామా చేశారు.