వైభవంగా ముగిసిన వారణాసి రామయ్య జయంతి ఉత్సవాలు

వైభవంగా ముగిసిన వారణాసి రామయ్య జయంతి ఉత్సవాలు

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో శ్రీ సద్గురు వారణాసి రామయ్య ప్రభువు 82వ వార్షికోత్సవాలు శుక్రవారం నాడు వైభవంగా ముగిశాయి. బుధవారం నుంచి మూడు రోజులు పాటు ఘనంగా జరిగిన ఉత్సవాలలో  కనకమామిడితో పాటు చుట్టుపక్కల అనేక గ్రామాలు, హైదరాబాద్ నుంచి వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.  శుక్రవారం నాడు వారణాసి రామయ్య పల్లకి సేవను, ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని  నిర్వహించారు. శ్రీరామ్ నగర్, కమ్మెట, గొల్లగూడెం, నర్సప్పగూడ, ఖానాపూర్, చిన్న మంగళారం,  సిద్ధులూరు పూడూరు, చేవెళ్ల, నారెగూడెం, గొల్లూరు గూడెం, బొబ్బిలిగామ, తాళ్లపల్లి, కొ మురబండ, చందానగర్, ఎల్కగూడ, మల్లాపూర్, దేవరంపల్లి, దామరగిద్ద, షాద్ నగర్ కు చెందిన బృందాలు మూడు రోజులపాటు భజనలు నిర్వహించాయని శ్రీ వారణాసి రామయ్య ప్రభు మఠం  ట్రస్ట్ అధ్యక్షులు కొండా లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. గురువారం నాడు జరిగిన ఆధ్యాత్మిక సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ వారణాసి రామయ్య ప్రభువు చేసిన ఆధ్యాత్మిక సేవలను ప్రశంసించారు. ప్రజలు ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని వారు సూచించారు. ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించిన పౌరాణిక పద్య నాటకాలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి