బిగ్ డీలర్

బిగ్ డీలర్
  • హైరేంజ్​ డ్రగ్స్​ప్రొడ్యూసర్​
  • కేపీ చౌదరి దగ్గర బడా కస్టమర్స్​
  • వీకెండ్ పార్టీలకు అసలైన సప్లయిర్​
  • చాటింగ్​లో సినీతారలు, ప్రముఖులు
  • కోడ్​ రూపంలో డ్రగ్స్​కోసం సంభాషణ

ముద్ర, తెలంగాణ బ్యూరో :టాలీవుడ్​కు మళ్లీ డ్రగ్స్​టెన్షన్​ మొదలైంది. కబాలి ప్రొడ్యూసర్​కేపీ చౌదరి దగ్గర పెద్ద పెద్ద కస్టమర్ల జాబితాను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తున్నది. చౌదని ఫోన్ లో సినీ రంగానికి చెందిన ఇద్దరు హీరోయిన్లు, నలుగురు నటీమణులు, ప్రముఖ దర్శకుడి ఫోన్ నంబర్లు, ఫొటోలను పోలీసులు గుర్తించినట్టు సమాచారం. గోవా, హైదరాబాద్‌ శివారులో ఏర్పాటు చేసిన ప్రయివేటు పార్టీలకు పలువురు నటులు హాజరైన కూడా ఫొటోలనూ గుర్తించారు. చౌదరి వీకెండ్​పార్టీలకు డ్రగ్స్​ సరఫరా చేయడమే కాకుండా, కస్టమర్లను పెంచుకునేందుకు పార్టీలు నిర్వహించారని తేలింది. చౌదరి అరెస్ట్​ తర్వాత డ్రగ్స్ రాకెట్​లో తవ్వేకొద్దీ లింకులు బయటపడుతున్నాయి. సినీ జనాల పేర్లు తెర పైకి వస్తున్నాయి. నైజీరియన్ల మత్తు దందాతో సినీ పరిశ్రమకు లింకులున్నట్టు ఆధారాలు బయటపడటం కలకలం సృష్టిస్తోంది. ఇటీవలే అరెస్టయిన రోషన్ ఫోన్ లో లభించిన ఆధారాలతో  చౌదరిని పట్టుకున్న పోలీసులు అనేక కీలక విషయాలు గుర్తించినట్లు తెలుస్తోంది. గోవా కేంద్రంగా మాదకద్రవ్యాల సరఫరా కీలక సూత్రధారి నైజీరియన్ పెటిట్ ఎబ్యూజర్ అలియాస్ గాబ్రియేల్ కోసం గాలిస్తున్న సైబరాబాద్ పోలీసులు అతడితో చౌదరికి సన్నిహిత సంబంధాలున్నట్టు గుర్తించారు. చౌదరి గోవాలో హోటల్ ప్రారంభించినప్పుడు నైజీరియన్లతో పరిచయాలు ఏర్పడటం, వాటి ఆధారంగా అంతర్జాతీయ డ్రగ్ డీలర్లకు దగ్గరైనట్లు విచారణలో తేలింది. 

బిగ్ డీలర్​

దాదాపు యేడాది కాలంగా ఏపీ, తెలంగాణకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ, రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖులు చౌదరి వద్దనే ఖరీదైన కొకైన్ కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. చౌదరి నాలుగు ఫోన్లలో డ్రగ్స్​డీల్స్​బయటకు వచ్చాయి. వీకెండ్ పార్టీలు, రేవ్ పార్టీలు, ఫామ్ హౌస్ పార్టీలు అంటూ కొత్త వారికి డ్రగ్స్ అలవాటు చేశారని, అలవాటుపడ్డాక కస్టమర్లుగా మార్చుకున్నారని తేలింది. గోవాలో గ్రాము కొకైన్ రూ.7 వేలకు కొనుగోలు చేసి, హైదరాబాదులో రూ.15 వేల నుంచి రూ. 18 వేలకు విక్రయించారు.  గ్రాము హెరాయిన్ గోవాలో రూ.3500 ఉంటే, హైదరాబాద్​లో రూ.7 వేలకు అమ్ముతున్నారు.  

ఎవరెవరు ఉన్నారు?

చౌదరి జాబితా టాలీవుడ్ లో ఆందోళన కనిపిస్తోంది. జాబితాలో ఎవరున్నారు? ఇది ఎంతవరకూ వెళ్తుందన్న భయం పట్టుకున్నది. 2017 డ్రగ్స్ కేసులో పలువురికి నోటీసులిచ్చి, వారిని పిలిపించి విచారణ జరిపిన పోలీసులు తర్వాత ఒక్కసారిగా కేసును నీరుగార్చారన్న ఆరోపణలున్నాయి. దీనికి ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ఒత్తిడి కారణమని విపక్షాలు ఆరోపించాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ నేరుగానే కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు గుప్పించారు. ఈసారి చౌదరి జాబితా ఆధారంగా కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తున్నది. జాబితా ఆధారంగా కొంతమందికి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తున్నది. వాట్సాప్​ డేటాను డిలీట్​ చేయడంతో, వాటిని రిట్రీట్​ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.