నేడు చంద్రుడిపై చంద్రయాన్ - 3

నేడు చంద్రుడిపై చంద్రయాన్ - 3

ముద్ర, తెలంగాణ బ్యూరో : అంతరిక్షయానంలో ఈ రోజు అత్యంత కీలక ఘట్టం చోటు చేసుకోబోతోంది. గత నెల 14న‌..నిప్పులు విరజిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3.. 41 రోజుల సుదీర్ఘ పయనం తర్వాత ఈ రోజు సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడి దక్షిణ ద్రువం వైపు కాలు మోపనుంది.‌ దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. ఒకవేళ ఏదైన అసాధారణ పరిస్థితి ఎదురైతే ఈ నెల 27న ల్యాండింగ్ కు ఇస్రో చర్యలు తిసుకోనుంది.