జుక్కల్ సభలో సీఎం కేసీఆర్    

జుక్కల్ సభలో సీఎం కేసీఆర్    
  • ఓటు ఎంతో విలువైనది...ఆగం కావద్దు -ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చాము                                          
  •  పదేళ్లు అభివృద్ధి చేసాం -ఆదరించండి -జుక్కల్ సభలో సీఎం కేసీఆర్                                    

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ఓటు హక్కు ఎంతో విలువైనది...ఎవరికో ఓటు వేసి ఆగం కావద్దు... ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చామ....పదేళ్ల పాటు తెలంగాణ ను అభివృద్ధి చేసాం...ఇచ్చిన హామీలను నెరవేర్చామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.సోమవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ లో జరిగిన ప్రజా ఆశీర్వద సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ రైతు బంధు వెస్ట్ అని, ధరణిని నిలిపివేస్తామని, 3 గంటలు విద్యుత్ ఇస్తామని చెబుతూ రైతులకు దగా చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

వెనుకబడిన జుక్కల్ లో హన్మంత్ షిండే ఎంతో అభివృద్ధి చేశారని, నాగమడుగు ద్వారా వేల ఎకరాలకు నీరందుతుందని అన్నారు. లెండి ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ నిర్మాణం చేపడతామని అన్నారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు షిండే ప్రతిపాదించారని, 3వ సారి అధికారం లోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. తెలంగాణ సెక్యూలర్ రాష్ట్రమని అన్నారు. తలసరి ఆదాయంలో రాష్ట్రం ముందంజలో ఉందని అన్నారు. హిందు, ముస్లిం, సిక్కు, ఈసాయి అందరూ భాయ్ భాయ్ లా ఉంటామని అన్నారు.