మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషన్ వేధింపులు

మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషన్ వేధింపులు

కోర్టు నివేదిక సమర్పించిన ఢిల్లీ పోలీసులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ఉద్దేశపూర్వకంగానే మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. అవకాశం దొరికినప్పుడల్లా మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించినట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కోర్టుకు నివేదిక సమర్పించారు. ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు తజకిస్తాన్ వెళ్లినప్పుడు మహిళా రెజ్లర్లలో ఒకరిని బ్రిజ్ భూషన్ తన గదికి పిలిచి గట్టిగా కౌగిలించుకున్నారన్నారు. ఆమె ప్రతిఘటించడంతో ఓ తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిగా అలా చేసినట్లు తన చర్యను బ్రిజ్ భూషన్ సమర్థించుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.  అదే సమయంలో అనుమతి లేకుండా తన చొక్కను పైకెత్తి అసభ్యంగా బ్రిజ్ భూషన్ ప్రవర్తించారని మరో మహిళా రెజ్లర్ ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు కోర్టులో తెలిపారు.