నేను స్టూడెంట్ సర్... నిర్మాతగా నన్ను నిలబెడుతుంది

నేను స్టూడెంట్ సర్... నిర్మాతగా నన్ను నిలబెడుతుంది

   స్వాతిముత్యం’ సినిమాతో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సర్'తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్‌ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ అంచనాలు పెంచాయి. జూన్ 2న నేను స్టూడెంట్ సార్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో నిర్మాత 'నాంది' సతీష్ వర్మ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. 'నాంది' అయినా 'నేను స్టూడెంట్ సర్' అయినా .. ఏదైనా ఓకే చేయడానికి కారణం కథలో వున్న మంచి కొత్త పాయింట్. నాంది సినిమాలో హీరో లీగల్ గా రివెంజ్ తీర్చుకోవడం అనేది కొత్త పాయింట్. నేను స్టూడెంట్ సర్ లో కూడా కొత్త పాయింట్ వుంది. మంచి థ్రిల్లర్ జోనర్ లో వెళుతుంది.

బెల్లంకొండ గణేష్ ఈ కథకు చక్కగా సరిపోయారు. నేను స్టూడెంట్ సర్, నాందికి వచ్చిన క్రేజ్ ని నిలబెడుతుందని భావిస్తున్నాను. కృష్ణ చైతన్య గారు ఓ అరగంట కథ చెప్పారు. కథ ఒక మొబైల్ ఫోన్ తో మొదలౌతుంది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే అంశం. స్టూడెంట్స్ మంచి ఐఫోన్ కొనుక్కోవాలని చాలా తాపత్రయ పడతారు. ఇది ప్రతి కుటుంబంలో చూస్తాం. ఆ పాయింట్ బాగా నచ్చింది. అలాగే ఈ సినిమా ఐఫోన్ తో స్టార్ట్ అవుతుంది కానీ మంచి థ్రిల్లర్ గా వెళుతుంది. మూడు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లు వుంటాయి.  ఆ ట్విస్ట్ లు నచ్చి కథ ఓకే చేశాను. సందేశం అంటూ ప్రత్యేకంగా ఏమీ వుండదు. యూనీవర్సిటీలో స్టూడెంట్ లైఫ్ ని చూపించాం. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఎదురౌతాయా ? ఆ ఇబ్బందులు ఎక్కడి వరకూ తీసుకెళతాయి ? అలాగే మనం పేపర్ లో చదివే ఓ రెండు సంఘటనలు ఇందులో ఉంటాయి. వాటిని మనం ఎప్పుడూ పట్టించుకోము. కానీ ఈ స్టూడెంట్ ద్వారా అది రివిల్ అవుతుంది. ఈ సంఘటన ఏమిటనేది సినిమా చూసినప్పుడు చాలా ఆసక్తికరంగా వుంటుంది.