బెల్లంకొండ సురేష్ చేతుల మీదుగా ధ్వని  

 బెల్లంకొండ సురేష్ చేతుల మీదుగా ధ్వని  

ఎల్.వి ప్రొడక్షన్ బ్యానర్ లో లక్షిన్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిలిం ధ్వని. డెఫ్ అండ్ డంప్ కాన్సెప్ట్ ఈ షార్ట్ ఫిలిం రూపొందించబడింది. నీలిమ వేముల నిర్మాతగా వ్యవహరించిన ధ్వని షార్ట్ ఫిలింకు అశ్విన్ కురమన సంగీతం అందించారు. ధ్వని షార్ట్ ఫిలిం రిలీస్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో నిర్మాత బెల్లంకొండ సురేష్, తుమ్మల రామ సత్యనారాయణ, దర్శకులు కరుణ కుమార్, మరియు జ్యోతి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్షిన్ కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ వరించడం విశేషం. పది ఏళ్ల లక్షిన్ ఇరవై ఏళ్లలోపు ఇరవై ఫిలిమ్స్ చేయాలనేది అనేది అతని లక్ష్యం. 

ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...లక్షిన్ పది ఏళ్ల వయసులో దర్శకత్వం చెయ్యడం అభినందించదగ్గ విషయం. ఎన్నో కంటెంట్స్ ను మనం ఇప్పుడు వివిధ మాధ్యమాల్లో చూస్తున్నాం, ధ్వని ది బెస్ట్ కాన్సెప్ట్, బెటర్ ఔట్ ఫుట్ తో లక్షిన్ తీశాడు. అబ్బాయి భవిషత్తులో మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు. దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ... లక్షిన్ తీసిన షార్ట్ ఫిలిం చాలా బాగుంది. ఈ వయసులో అబ్బాయి తీసిన విధానం ఎంతో బాగుంది. ధ్వని కసెప్ట్ తో పదకొండు నిమిషాల్లో అద్భుతంగా తెరకెక్కించారు. చాలా మంది నూతన దర్శకుల కంటే లక్షిన్ బెటర్ గా ధ్వని షార్ట్ ఫిలిం ను తీశారని తెలిపారు.