సోషల్ వెల్పేర్ బాలురు రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు

సోషల్ వెల్పేర్ బాలురు రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి పట్టణం శివార్లలోని సోషల్ వెల్పేర్ బాలురు రెసిడెన్షియల్ స్కూల్ లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆరవ తరగతి చదువుతున్న ప్రశాంత్, కృష్ణ అనే ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండగా హైదరాబాద్ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కలుషిత ఆహారం తిన్న ఎనమిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని మెరుగైన చికిత్స అందియ్యాలని డాక్టర్లను ఆదేశించారు.

అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన బీజేపీ, సిపిఎం ఎంపీ అభ్యర్థులు

భువనగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో విషపు ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్, బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ లు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్ లో విద్యార్థుల మౌలిక సదుపాయాలు లేక సరైన దృష్టి లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పౌష్టికాహారం సరిగ్గా అందించకపోవడం వల్ల అనారోగ్యం భారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు హాస్టల్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. వారి వెంట నాయకులున్నారు.