రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం...

రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం...

ముద్ర,హైదరాబాద్:-హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల రత్నదీప్ సూపర్ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది సహా అందరూ పరుగులు తీశారు. మాల్ లో మరమ్మత్తు పనులు చేసేందుకు సిబ్బంది లోపలికి వెళ్లారు. మరమత్తులు చేస్తుండగా ప్రమాదం జరిగి మంటలు వ్యాపించాయని సిబ్బంది తెలియజేశారు. దీంతో ఆ ప్రాంతమంతా పొగతో దట్టంగా వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.