నిప్పుల కుంపటిలా మారిన తెలంగాణ..

నిప్పుల కుంపటిలా మారిన తెలంగాణ..

ముద్ర,తెలంగాణ:- గత ఏడాది నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈసారి రికార్డుస్థాయి టెంపరేచర్స్ రికార్డు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.ఓవైపు భానుడి భగభగ..మరోవైపు విపరీతమైన వేడిగాలులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజరోజుకు ఎండలు పెరిగి రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

తెలంగాణలో నాలుగురోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. 42 డిగ్రీలు రికార్డు అవుతేనే వామ్మో ఎండలు అనుకుంటే.. ఇప్పుడు 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.జగిత్యాల జిల్లా జైనాలో 46.2, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సారి ఇవే హైటెంపరేచర్స్. గత ఏడాది నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈసారి రికార్డుస్థాయి టెంపరేచర్స్ రికార్డు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు  చెబుతున్నారు.