జోష్‌ ఎక్కడా తగ్గటలేదుగా?

జోష్‌ ఎక్కడా తగ్గటలేదుగా?

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్‌ బీచ్‌ ఎంజాయ్‌మెంట్లు ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. బీచ్‌లకు వెళ్ళడాలు అక్కడ ఎంజాయ్‌ చేసి ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ కి కన్నుల విందుగా ఉంటున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా సముద్ర విహారం ఇప్పుడు అభిమానుల్లో విస్త్రతంగా చర్చకు వచ్చింది. పాపులర్ ఐల్యాండ్ సీషెల్స్ (ఆఫ్రికా) లో సాహసోపేతమైన పర్యటనకు విచ్చేయాల్సిందిగా తన అభిమానులను టెంప్ట్ చేస్తూ ఓ వీడియోని సోనాక్షి షేర్ చేసింది. సోనాక్షి సిన్హా తన నెయిల్ బ్రాండ్ `సోజీ`ని ప్రమోట్ చేయడానికి తన బృందంతో కలిసి సీషెల్స్ కు బయలుదేరిందని సమాచారం. పనిలో పనిగా సీషెల్స్ కి బోలెడంత ప్రమోషన్ చేసింది.

ఈ ప్రయాణంలో సోనాక్షి దూకుడు ఆనందం చూస్తుంటే మునుపెన్నడూ లేని జోష్ ఇప్పుడు తన బాడీ లాంగ్వేజ్ లో కనిపిస్తోందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. సోనాక్షి సిన్హా ఇటీవలి వెబ్ షో `దహాద్` విజయంతో చాలా ఆనందంగా దూసుకుపోతోంది. ఈ సిరీస్ ఆద్యంతం ఠఫ్ కాప్ పాత్రలో సోనాక్షి అద్భుతంగా నటించింది. ఇంతలోనే తన గోళ్ల రంగు బ్రాండ్ ను ప్రచారం చేయడంలో బిజీ అయిపోయింది. ముఖ్యంగా తన నెయిల్ పాలిష్ బ్రాండ్ `సోజీ`ని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉంది. ఇటీవలే సీషెల్స్ కు వెళ్లి అక్కడ టూరిజానికి ప్రచారం చేయడమే గాక తన నెయిల్ పాలిష్ బ్రాండ్ ప్రచారంతోను డబుల్ ధమాకా ట్రీట్ ని ప్లాన్ చేయడం ఆసక్తికరం. ఓ అందమైన కొల్లాబ్ పోస్ట్ లో ఆమె బీచ్ దేశంలోని సుందరమైన ప్రదేశాలను అన్వేషిస్తూ కనిపించింది. ఈస్ట్ ఆఫ్రికన్ దేశాన్ని అన్వేషిస్తున్నప్పుడు తన సోషల్ మీడియా ఫాలోవర్ లను టీజ్ చేస్తూ కనిపించింది.