జూన్ 23 నుంచి ఓటీటీలో  ‘ఇంటింటి రామాయణం’

జూన్ 23 నుంచి ఓటీటీలో  ‘ఇంటింటి రామాయణం’

ఒక అద్భుత‌మైన సినీ ఉత్సవాన్ని ఎంజాయ్ చేయ‌టానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాల్సిన త‌రుణం ఆస‌న్నమైంది. ఈ ప్రయాణం మిమ్మల్ని తెలంగాణ ప్రాంతానికి తీసుకెళ్లనుంది.  దాని పేరే ‘ఇంటింటి రామాయణం’. ప్రేమ, హాస్యం, ఉత్కంఠత సహా అన్నీ అంశాల కలయికగా రూపొందిన చిత్రమే ఇది. తెలుగు నెంబ‌ర్ వ‌న్ ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’ సమర్పణలో ఆహా స్టూడియోస్‌, సితార ప్రొడ‌క్షన్స్ సంయుక్తంగా రూపొందిన ‘ఇంటింటి రామాయణం’ సినిమా జూన్ 23 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది...ప్రేక్షకుల‌ను అల‌రించ‌నుంది. 

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల‌ను తెలియ‌జేసే చిత్రమే ‘ఇంటింటి రామాయణం’. ఎన్నో చిత్రాల్లో విల‌క్షణ‌మైన పాత్రల్లో మెప్పించిన  న‌రేష్ వి.కె, రాహుల్ రామ‌కృష్ణ, న‌వ్యా స్వామి, గంగ‌వ్వ, బిత్తిరి స‌త్తి వంటి అద్భుత‌మైన న‌టీన‌టులు ఈ సినిమాలో త‌మదైన‌ న‌ట‌న‌తో అల‌రించారు. రాములు (న‌రేష్‌) చాలా మంచి మ‌న‌సున్న వ్యక్తి. ఎదుటివారి ప‌ట్ల జాలి ద‌య‌, క‌రుణ‌ను క‌లిగి ఉండే స్వ‌భావం త‌న‌ది. అలాంటి వ్యక్తి కుటుంబానికి సంబంధించిన గొప్ప నిధి ఒక‌టి క‌న‌ప‌డ‌కుండా పోతుంది.