బీఆర్ఎస్ ప్రతినిధిలా వ్యవహరిస్తున్న సింగరేణి సీఎండీ శ్రీధర్

బీఆర్ఎస్ ప్రతినిధిలా వ్యవహరిస్తున్న సింగరేణి సీఎండీ శ్రీధర్
  • బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులకు క్వార్టర్లు, భూములు కేటాయింపు..?
  • రుద్రంపూర్ లో అక్రమంగా 80 వరకు క్వార్టర్లను ఆక్రమించి అద్దెకు ఇచ్చిన టీబీజీకేఎస్ నాయకుడు..
  • వెంటనే ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి
  • ఆకునూరి కనకరాజు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:సింగరేణి సీఎండీ శ్రీధర్ అయినప్పటికీ రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన ఆయన బీఆర్ఎస్ ప్రతినిధిలా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయని ఆకునూరి కనకరాజు ఆరోపించారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీబీజీకేఎస్ నాయకులకు సింగరేణికి చెందిన అనేక క్వార్టర్లు, భూములు, భవనాలను కేటాయించారన్నారు. అధికారిక కేటాయింపులే కాకుండా, శ్రీధర్ సీఎండీ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు సింగరేణి భూములు, క్వార్టర్లు, భవనాలను అక్రమంగా ఆక్రమించుకున్నారని తెలిపారు. కొత్తగూడెం, రుద్రంపూర్ లో ఒక టీబీజీకేఎస్ నాయకుడు సుమారు 70 నుండి 80 వరకు క్వార్టర్లను అక్రమంగా ఆక్రమించి కొన్ని అద్దెకు కూడా ఇచ్చాడని తెలుస్తుందన్నారు. బెల్లంపల్లి, చెన్నూరు, ఎమ్మెల్యేలు, పినపాక ఎమ్మెల్యేలకు పలు క్వార్టర్ల భూములు కేటాయించారని తెలిపారు. సీఎండీ శ్రీధర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నేతలకు సింగరేణి క్వార్టర్లు, భూముల భవనాలను అధికారికంగా కేటాయించడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని ఆయన కోరారు. బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు గత 10 సంవత్సరాలలో అక్రమ ఆక్రమణలపై శ్రీధర్ చర్య తీసుకోకపోవడంపై కూడా ప్రభుత్వం దర్యాప్తు చేయాలని, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నేతలకు అధికారికంగా ఇచ్చిన క్వార్టర్స్ భూములు, భవనాల కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేయాలని, సింగరేణి భూముల భవనాల క్వార్టర్ల అక్రమ ఆక్రమణలను ప్రభుత్వం తొలగించాలని ఆయన కోరారు.