2024 సెలవుల లిస్ట్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

2024 సెలవుల లిస్ట్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

ముద్ర,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవ‌త్సరానికి సంబంధించి సెల‌వుల జాబితాను విడుదలచేసింది. మొత్తం 2024లో సాధార‌ణ సెల‌వులు 27, ఆఫ్షనల్ హాలీడేస్ 25 కలిపి 52 ఉన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.కొత్త ఏడాది సందర్భంగా జనవరి ఒకటో తేదీన సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు బదులుగా ఫిబ్రవరి 10వ తేదీన రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటించింది.