తెలంగాణకు కెసిఆర్ పాలనే స్వర్ణ యుగం

తెలంగాణకు కెసిఆర్ పాలనే స్వర్ణ యుగం
  • తెలంగాణకు కెసిఆర్ పాలనే స్వర్ణ యుగం
  • పుట్టుక నుండి చావు దాకా అన్ని సేవలు అందించాం
  •  మరువలేని సేవలుప్రజలు అందుకున్నారు
  • ప్రతిపక్షాలు ఇకనైనా సోయి తెచ్చుకోవాలి
  • బిజెపి నేతలకు సిగ్గే లేదు
  • మా నాయకులను కూడా మహారాష్ట్ర, కర్ణాటక పంపుతాం అక్కడి అభివృద్ధి చూసి రమ్మని...
  • సంక్షేమ దినోత్సవ సభల్లో రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు

ముద్ర ప్రతి నిధి: సిద్దిపేట : తెలంగాణకు కెసిఆర్ పాలనే స్వర్ణ యుగం.. పుట్టే మనిషి నుండి మరణించిన మనిషి దాకా అన్ని రకాల సేవలు అందిస్తున్న ప్రభుత్వం మాది... సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేసే బిజెపి నాయకులకు సిగ్గు కూడా లేదు... ప్రతిపక్షాలు ఇకనైనా సోయి తెచ్చుకోవాలి... కావాల్సినన్ని నిధులు ఇచ్చి చేయాల్సిన అన్ని పనులు చేస్తే మా పార్టీ నాయకులు కూడా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్నారు.ఇక్కడ ఎట్లుందో తెలిసింది కదా మమ్ములను మహారాష్ట్రకు, కర్ణాటకకు పంపుతా బస్సులలో.. షిరిడి సాయినాధుని దర్శించేసుకొని అక్కడున్న పల్లెలను చూసి రండి అప్పుడు తెలుస్తది మీకు.. అంటూ రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.


తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు సిద్దిపేట, హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి సంక్షేమ దినోత్సవ సభల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట్ జెడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ , హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ ఆయా ప్రాంతాలప్రజాప్రతినిధులు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సిద్దిపేట సభలో ఉద్విగ్నంగా ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు సోషల్ మీడియా వేదికగా మెడికల్ కాలేజీలు తెలంగాణకి ఇచ్చామని బిజెపి నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి ఈ సందర్భంగా తిప్పి కొట్టారు. కరీంనగర్ కు కానీ పైసా దీని బండి సంజయ్, కేంద్రం నుంచి వెనుకబడిన సంక్షేమ శాఖకు రావాల్సిన 1350 కోట్ల నిధులను ఇప్పించలేని మంత్రి కిషన్ రెడ్డికి ఏమాత్రం సోయున్న వెంటనే నిధులు విడుదల చేయించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చేలా బిజెపి నేతలు చూడాలని హితోపలికారు. రాష్ట్రంలో త్వరలో గర్భస్థ శిశువు అభివృద్ధికి కూడా న్యూట్రిషన్ కిట్టును అందించబోతున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు ఈ పథకం కింద రాష్ట్రంలో ఆరు లక్షల 80 వేల మంది గర్భిణీ స్త్రీలు లబ్ధి పొందుతారని ఆయన వివరించారు సంపన్న వర్గాల వారే ఇన్నాళ్లు వాడిన న్యూట్రిషన్ ఆహారాన్ని ఇకనుంచి ప్రభుత్వం పేద వర్గాలకు కూడా అందించనున్నదని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పొలాలు పేద బడుగు బలహీన దళిత వర్గాలకు చేరాయని ఇక తమ ప్రగతియాత్ర ఆగదని మంత్రి హరీష్ రావు తెలిపారు.దేవుని దయ వల్ల గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయింది. రేపో, ఎల్లుండో కటక ఒత్తుడే ఆలస్యం నీళ్లు పోయగానే హుస్నాబాద్ వాళ్ళ బాధలు కూడా తొలగిపోతాయని మంత్రి హరీష్ రావు తెలిపారు అన్ని పండుగలు కలిసొస్తే ఎంత గొప్పగా ఉంటదో అంతటి పండుగను మనం గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజు జరుపుకుందామన్నారు .

సిద్దిపేట నుండి పలు పథకాలు ప్రారంభించిన మంత్రి

 సిద్దిపేటలో సెట్విన్ ద్వారా శిక్షణ పొందిన 40 మంది దళిత యువతులకు దశాబ్ది దినోత్సవ సభలో ఉచితంగా కుట్టుమిషన్లను మంత్రి అందజేశారు చిన్నకోడూరు మండలం మల్యాల గ్రామానికి చెందిన గొల్ల కురుమలకు గొర్రెలను రెండో విడత గొర్రెలకు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంత్రి అందజేశారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు కుల వృత్తుల పరిరక్షణకై నూతనంగా చేపట్టిన లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకాన్ని మంత్రి హరీష్ రావు చేతులమీదుగా సిద్దిపేటలో ప్రారంభించి 15 మందికి చెక్కులను మంత్రి అందజేశారు.

వితంతుల స్వయం ఉపాధి కోసం 50 వేల చొప్పున 27 మందికి చెక్కులను పంపిణీ చేశారు కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు కళ్యాణ లక్ష్మి నిధులు కాకుండా మరో లక్షన్నర కలిపి అందజేశారు. 8 మంది కార్మికులకు ప్రమాద బీమా సొమ్మును పంపిణీ చేశారు నిరుపేద రైతులు ఆరుగురికి పంపు సెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జిల్లా సాంఘిక సంక్షేమ, పశు సంక్షేమ, దళిత సంక్షేమ, మహిళా సంక్షేమ, యువజన సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.