కొండపైకి చేరుకుంటున్న భక్తులు.. 

కొండపైకి చేరుకుంటున్న భక్తులు.. 

నేటి నుంచి కొండగట్టులో చిన్న జయంతి
ముద్ర, మల్యాల: చిన్న హనుమాన్ జయంతి సందర్బంగా కొండగట్టుకు భక్తుల రాక మొదలైంది.. సోమవారం సాయంత్రం నుంచే భక్తులు, దీక్షపరులు వేలాదిగా కొండపైకి చేరుకుంటున్నారు... ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం నుంచి మూడు రోజులపాటు చిన్న జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలకు ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తిస్ ఘడ్, ఒరిస్సా నుంచి దాదాపు 3 నుంచి 5 లక్షల వరకు భక్తులు తరలివచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.. ముక్యంగా 11,21 రోజులు దీక్ష పూర్తి చేసిన స్వాములు జయంతి సందర్బంగా కొండగట్టు అంజన్న సన్నిధిలో మాల విరమణ చేయడం ప్రతి ఏటా జరుగుతుంది. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలేత్తకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

 కాలినడకన.. దీక్షపరులు...
11,21 రోజుల దీక్ష పూర్తి చేసుకున్న స్వాములు, చాలా మంది కాలినడకన కొండగట్టుకు తరలివస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా కాళ్ళకు సాక్షులు ధరించి, కొండపైకి చేరుకుంటున్నారు. కాలినడకన వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రధాన రహదారిపై ఎటూ రెండు కిలోమీటర్లు త్రాగునిటీ వసతి కల్పించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన, అధికారులు ఏర్పాట్లు చేయకపోవడం గమనార్హం.

 'కొండ'త నిర్లక్ష్యం..
 ఇది ఇలా ఉండగా, కొండపై ఏర్పాట్లు ఇంకా సా..గుతూనే ఉన్నాయి.. సమీక్షా సమావేశంలో కలెక్టర్ పేర్కొన్న విధంగా అధికారులు ఎక్కడ కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయలేదు. ప్రధాన ఆలయం ముందు చిన్న చిన్న శానిటేషన్ పనులు సోమవారం రాత్రి కొనసాగించడం గమనార్హం. కోనేరు లో భక్తులు మునిగేంత వాటర్ లేకపోవడం వారి నిర్లక్షానికి అద్దం పడుతోంది.