కోటి 53 లక్షలు స్వాధీనం

కోటి 53 లక్షలు స్వాధీనం
  • ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు అయినప్పటి నుండి ఆదారాలు లేని నగదు 1,53,88,930 రూపాయలు, మద్యం 1821.345 లీటర్లు వాటి విలువ 9,55,794 రూపాయలు మొత్తం కలిపి 1,69,37,558 రూపాయల స్వాధీనం. చేసుకున్నట్లు ఎస్పీ పి.రోహిణి ప్రియదర్శిని తెలిపారు. బుధవారం మాట్లాడుతూ....అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  ఏర్పాటు చేసిన జిల్లా చెక్  పోస్టులలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని, ఆదారాలు లేని నగదు, మద్యంపై, ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. మోడల్ కోడ్ అమలులోకి వచ్చినందున ప్రజలు రూ.50వేల రూపాయల నగదు కంటే ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లే వారు, పెద్ద మొత్తంలో బంగారం, ఇతర వస్తువులను తీసుకెళ్లేవారు సరియైన  ఆధారాలను చూపాలని సూచించారు. ఆధారాలు లేకుంటే నగదు, ఇతర వస్తువులు, బంగారం ఆభరణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎన్నికలను నిష్పక్షపాతముగా నిర్వహించడమే లక్ష్యంగా  జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలిపారు.