అమరుల కుటుంబాల సంక్షేమం కోసం ‘ప్రాజెక్టు నమన్’

అమరుల కుటుంబాల సంక్షేమం కోసం ‘ప్రాజెక్టు నమన్’

ముద్ర, తెలంగాణ బ్యూరో : అమరవీరుల కుటుంబాలకు సాయం చేయడం కోసం ఇండియన్ ఆర్మీ ‘ప్రాజెక్టు నమన్’ను ప్రారంభించింది.  సైన్యంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాల సమస్యలను, ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. 

ఈ ప్రత్యేక కేంద్రాన్ని తొలిసారిగా ఢిల్లీ కంటోన్మెంట్ లో  ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇండియన్ ఆర్మీకి చెందిన డైరెక్టర్ ఆఫ్ ఇండియా ఆర్మీ వెటర్నన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ , సీఎస్ఈఈ- గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. దీనిలో సైనిక కుటుంబాలకు సౌకర్యాలు కల్పించడానికి ఒక కామన్ సేవా కేంద్రం ఉంటుంది. అన్ని ప్రభుత్వ కస్టమర్ సేవలను అందజేస్తుంది. ఈ ప్రాజెక్టు రెండో దశలో దేశవ్యాప్తంగా వివిధ సైనిక స్టేషన్లలో మరో 13 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.