మహేశ్వర్ రెడ్డి ఆమరణ దీక్షకు మద్దతుగా రాస్తా రోకోలు - ఎక్కడికక్కడ అరెస్టులు

మహేశ్వర్ రెడ్డి ఆమరణ దీక్షకు మద్దతుగా రాస్తా రోకోలు - ఎక్కడికక్కడ అరెస్టులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ మునిసిపాలిటీ లో నూతన మాస్టర్ ప్లాన్ అమలు యత్నానికి వ్యతిరేకంగా బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం తన నివాసంలో ఆమరణ దీక్ష ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో బిజెపి శ్రేణులు ఆయనకు మద్దతు గా ఎక్కడికక్కడ నిరసనలు, రాస్తారోకో లు చేపట్టారు. ఫలితంగా నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇప్పటికే దిలావర్ పూర్, సోన్ మండల కేంద్రాల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున రాస్తా రోకోలు నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. సోన్ మండలకేంద్రంలో 44వ జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే దిలావర్ పూర్ మండల కేంద్రంలో 62వ జాతీయ రహదారిపై కార్యకర్తలు బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.