సజావుగా సింగరేణి గుర్తింపు సంఘాల పోలింగ్ 

సజావుగా సింగరేణి గుర్తింపు సంఘాల పోలింగ్ 
  • పోలింగ్ అనంతరం కౌంటింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
  • సింగరేణి ఆర్జి 1 ఏరియాలో పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ లో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్


ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: సింగరేణి ఆర్జి 1 ఏరియాలో పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసి, సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు.బుధవారం రామగుండంలోని ఆర్జి-1ఏరియా పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని అదనపు తనిఖీ చేసి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.

అదనపు కలెక్టర్ మాట్లాడుత  సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని,  పోలింగ్ అనంతరం కౌంటింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు.పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్ లను కమ్యూనిటీ హాల్ కు తరలించి రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.కౌంటింగ్ నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కుమార స్వామి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.