పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

శంకరపట్నం,ముద్ర:-కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కీసర సంపత్ ముదిరాజ్  ఆధ్వర్యంలో  ముదిరాజులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాటలపై భారీ ఎత్తున మండల పరిధిలోని అన్ని ముదిరాజు సంఘాల గౌరవ సభ్యులు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కార్యదర్శులు ఉపాధ్యక్షులు ముదిరాజ్ యువకులు తరలివచ్చారు. అయన డిస్టిబొమ్మని మండల కేంద్రంలోని కరీంనగర్ -వరంగల్ ప్రధాన రహదారిపై నిప్పంటిచి నిరసన వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా కార్యదర్శి భూమ సంపత్ నియోజక వర్గం అధ్యక్షులు గుల్ల రాజు గౌరవాధ్యక్షులు పొలవెన్ని బిక్షపతి పోలు భరత్ సంఘం అధ్యక్షులు గూళ్ల పాపయ్య, రాణవేణి మల్లయ్య  నూనె రవి భూమా  రవీందర్ రాణవేణి కుమార్ అన్ని గ్రామాల ముదిరాజ్ యువకులు తరలివచ్చారు.