మొహర్రం మత సామరస్యానికి ప్రతీక: మంత్రి గంగుల కమలాకర్

మొహర్రం మత సామరస్యానికి ప్రతీక: మంత్రి గంగుల కమలాకర్

మొహర్రం సందర్భంగాపాత బజార్ లో పీరిలపండుగ వేడుకలో పాల్గొని మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక ప్రార్దనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణాలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం పండుగను అందరూ కలిసి మెలసి ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.. ఈ సందర్భంగా సందర్శకులకు మజ్జిగ పంపిణి చేసారు.. ఈ కార్యక్రమంలో బారాసా నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమీ కార్పొరేటర్లు బండారి వేణు, తోట రాములు,షర్ఫు, బర్కత్ అలీ,మైనార్టీ నగర అధ్యక్షులు శౌకత్ అలి, నవాజ్, అజ్మాత్ అలీ, తదితరులు పాల్గొన్నారు.