కార్యకర్తలు అధైర్య పడొద్దు

కార్యకర్తలు అధైర్య పడొద్దు
  • మీకు అండగా ఉంటాం
  • మాజీ మంత్రి హరీష్ రావు భరోసా

ముద్ర ప్రతినిధి, మెదక్:ఎన్నికల్లో ఓటమితో అధ్యర్యపడాల్సిన అవసరం లేదని,  కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యేతన్నీరు హరీష్ రావు భరోసా ఇచ్చారు.బుధవారం మెదక్ వైస్రాయ్ గార్డెన్ లో మెదక్, హవేలీగణపూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో  పాల్గొన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ...ఎన్నికల్లో  కష్టపడి పని చేసిన కార్యకర్తలకు, కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పాలని ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మెదక్  లో ఓటమి చెందడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల ప్రచారంలో  కాంగ్రెస్ ఎన్నో గ్లోబల్ ప్రచారం తప్పుడు ప్రచారాలు చేశారు. వాటిని తిప్పికొడుతూ ప్రతి ఊర్లోకార్యకర్తలు కష్టపడ్డారన్నారు. 
ఓటమి చెందిన తక్కువ మెజార్టీతో ఓడిపోయాం.

మెదక్ పార్లమెంట్ పరిధిలో 6  అసెంబ్లీలో బిఅర్ఎస్  గెలిచింది, నా దృష్టిలో ఈ ఓటమి ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిదన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో మీకోసం నిలబడతా ప్రచారం చేస్తా అన్నారు. పార్టీ పక్షాన మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బిఆర్ఎస్ పార్టీదీ, పార్టీ అండగా ఉంటుందన్నారు. విద్యుత్ పై కాంగ్రెస్ శ్వేత పత్రం విడుదల చేశారు. మేము ఉండగా కరెంటు 6 గంటలకు ఇచ్చామని బిఆర్ఎస్ పార్టీ 24 గంటల కరెంటు ఇచ్చిందని వాళ్లే చెప్పారన్నారు.గతంలో ఆరు గంటల కరెంటు ఇచ్చినప్పుడు మోటార్ లు కాలుడు,  ట్రాన్స్ఫార్మర్లు పేలుతుండే అన్నారు.

 
50 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి రైతులకు ఉచిత కరెంటు ఇచ్చామన్నారు. ఎంఎన్ కెనాల్, ఎఫ్ఎన్ కెనాల్ లో నీళ్లు కావాలని హైదరాబాద్ పోయి ధర్నాలు చేశాం, గత పది సంవత్సరాల కాలంలో రైతులు నీళ్ల కోసం ధర్నాలు చేసిన సంఘటనలు ఉన్నాయా అని ప్రశ్నించారు. హైదరాబాద్ కు గోదావరి నీళ్లు తెచ్చాము, సింగూర్ నీళ్లు మెదక్ ప్రజలకు అందించింది బిఆర్ఎస్ ప్రభుత్వం అని హరీష్ రావు పేర్కొన్నారు. మీ హయాంలో ఎందుకు కాలువలు కూడుకుపోయాయి, సర్కార్ తుమ్మలు  ఎందుకు మొలిఛాయన్నారు. హల్ది మీద, మంజీరా మీద చెక్  డ్యాములు కట్టాం,కాలేశ్వరం, కొండపోచమ్మ సాగర్ లేకపోతే నీళ్లు వచ్చేవి కావన్నారు. ఒక గుంట కూడా ఎండకుంట పంట పండించాంమని, ప్రస్తుతం రైతులు  వస్తయ రావా అని ఆందోళనలో ఉన్నారన్నారు.

నీళ్లు,కరెంట్ వస్తదా రాదా, నీళ్లు వదులుతదా, వదలరా అని అనుమానంలో రైతులు ఉన్నారు. బిఆర్ఎస్ పార్టీ అంటే రైతులకు విశ్వాసమన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితి రైతుబంధు ఇచ్చామని గుర్తు చేశారు. కరోనా సమయంలో ఆదాయం నీళ్లు ఖర్చులు ఫుల్ ఉన్నా సంక్షేమం ఆగలేదన్నారు. సకాలంలో రైతులకు పెట్టుబడి సహాయం ఇచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. రైతు బీమా మంచిది కాదని కాంగ్రెస్ వాళ్లు మాట్లాడుతున్నారు. ఇది దుర్మార్గమైన చర్య అన్నారు. రైతు కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది కేసీఆర్ అన్నారు.  చనిపోయిన వారికి రైతు బీమా ఎందుకని మాట్లాడుతున్నారు.ప్రగతి భవన్ లో ఎన్ని గదులు ఉన్నాయో ఉపముఖ్యమంత్రి బట్టి చెప్పాలని కోరితే సమాధానం లేదు, నిజం నిలకడగా తెలుస్తదన్నారు. తెలంగాణ ప్రజల కోసం అరెస్ట్ అయ్యాం, తెలంగాణ తెచ్చింది బిఆర్ఎస్ పార్టీతోనే, తెలంగాణతో మనకు పేగు బంధం ఉందన్నారు. తెలంగాణ కోసం దెబ్బలు తిన్నాం, రైలు పట్టాలపైన కూర్చున్నామన్నారు.

 
వందల కేసులకు భయపడకుండా తెలంగాణ కోసం పోరాటం చేశామన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం మేం రాజీనామా చేసినఓ,  కాంగ్రెస్ వాళ్లు చేశారా అని ప్రశ్నించారు. ఎన్నో మాయమాటలు చెప్పారు. ప్రజలు ప్రశ్నించే రోజులు వస్తాయి అప్పటివరకు ఓపిక పట్టాలన్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా ఏందో చూపించాలన్నారు. ఎంపీ సీటు గెలుపొందడం పక్కా అన్నారు. ఏడుపాయల అభివృద్ధికి 100 కోట్ల రూపాయల జీవో ఇచ్చాడు ముఖ్యమంత్రి కేసీఆర్. మెదక్ పట్టణానికి 50 కోట్లు మంజూరు అయ్యాయి. ప్రజల పక్షాన ఉండాలి అంతిమంగా ప్రజలే గొప్పవాళ్లన్నారు. గ్రామాల్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీకి పూల బాటలు ఉన్నాయి ముళ్ళబాటలున్నాయి మనకేం కొత్త కాదన్నారు. ప్రజల గొంతుకగా నిలబడతాం.ఆరు నెలలు ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతాయి.

మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలు చాలా చేసి చూపించాం, దళిత బంధు, బీసీ బందు, రుణమాఫీ విషయంలో కార్యకర్తలు  కొన్ని సూచనలు చేశారు వాటిని పరిగణలోకి తీసుకుంతామన్నారు. దళిత బంధు మంచి పథకమైనప్పటికీ దానివల్ల ఇబ్బంది వచ్చిందన్నారు. కరోనా రాకపోతే మన పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండేదన్నారు.  కరోనా రాకపోతే రుణమాఫీ ముందే చేసేవాళ్ళమన్నారు. గెలిచినప్పుడు విర్రవీగలేదని, ఓడిపోయినప్పుడు కుంగిపోలేదన్నారు. రాజకీయాలు అన్నపుడు   గెలుపొటములు సహజమన్నారు. తెచ్చిన తెలంగాణను అభివృద్ధిలో తీసుకుపోయింది మనమే అన్నారు.  మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన  సమావేశంలో ఎమ్మెల్సీ శరీ సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, జెడ్పి ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, ఎంపీపీ అధ్యక్షులు యమున జయరాంరెడ్డి, జడ్పిటిసి సుజాత శ్రీనివాస్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.