ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ముద్ర, చివ్వెంల : ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు శనివారం కుడ కుడ  లోని ఆలేటి ఆటం అనాధ ఆశ్రమంలో ఖాసిం పేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు అంజద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీ, 2023 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సోనియాగాంధీకి జన్మదిన కనుక అందించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం తరపున దేశ సేవ చేస్తున్న గొప్ప మహనీయులు సోనియా అని అన్నారు. అనంతరం అనాధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేసి కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతమల్ల రమేష్, సింగిల్ విండో డైరెక్టర్ యండి సలీం, గ్రామ అధ్యక్షుడు తులసీదాస్, ఎడవెల్లి బిక్షం, లింగమంతులు, మోర్తాల లింగారెడ్డి, అలిశెట్టి రమేష్, షేక్ నసీరుద్దీన్, నాగులు, పాషా, నాల్గవ వార్డ్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.