TS SSC Results 2024: రేపే తెలంగాణ టెన్త్ పరీక్ష ఫలితాలు ...

TS SSC Results 2024: రేపే తెలంగాణ టెన్త్ పరీక్ష ఫలితాలు ...

ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. పరీక్ష పత్రాల మూల్యాంకనం, కంప్యూటీకరణ కూడా పూర్తవడంతో ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో ఫలితాలను వెల్లడించనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా టెన్త్ క్లాస్ ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,7,952 మంది బాలురు కాగా, 2,50, 433 మంది బాలికలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.తెలంగాణ టెన్త్ రిజల్ట్స్‌ను https://results.cgg.gov.in వెబ్‌సైట్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. విద్యార్థల హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే.. స్క్రీన్‌పై రిజల్ట్స్‌ ప్రత్యక్షం అవుతాయి. ఫలితాలతో పాటు మార్కుల మెమో కూడా ఉంటుంది.