వామ్మో... పులులు...

వామ్మో... పులులు...
  • ముత్తారం మండలం శుక్రవారం పేట శివారులో  సంచారం..
  •  రైతు పొలంలో రెండు చిరుతపులుల  అడుగుజాడలు..
  • మూడు రోజుల క్రితం లక్కారంలో దుప్పిని చంపిన పులి 
  • కాదు...కుక్కలని తేల్చిన ఆటవీ శాఖ అధికారులు... 
  • సోమవారం రైతుల పొలాల్లో పులి అడుగుల అనవాల్లు కనిపించాయన్న రైతులు...
  • భయాందోళనలు గ్రామీణ  ప్రజలు...
  • పత్తాలేని ఫారెస్ట్ అధికారులు....

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి పులుల సంచారం పెద్దపల్లి జిల్లాలో  కలకలం రేపుతుంది. పెద్దపల్లి జిల్లా  ముత్తారం మండలం లక్కారం, శుక్రవారం పేట శివారులోని రైతుల పొలంలో రెండు చిరుత పులుల  అడుగు జాడలు కనిపించాయని,  మూడు రోజుల క్రితం లక్కారంలో దుప్పిని చంపింది పులేనని గ్రామస్తులు, రైతులు వాపోతున్నారు.  అటవీ శాఖ అధికారులు మాత్రం నిర్ధారించడం లేదు. పులి కాదు...కుక్కలు దాడి చేయడం వల్లనే దుప్పి చనిపోయి ఉంటుందని చెబుతుండగా, దుప్పిని కుక్కలు చంపడం సాధ్యపడదని, అది ముమ్మాటికి  చిరుత పులి  దాడి చేయడం వల్లనే జరిగిందని రైతులు స్పష్టం చేస్తున్నారు. కానీ సోమవారం రాత్రి రైతుల పొలాల్లో పులి అడుగుల అనవాల్లు కనిపించాయని, రైతులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో  అధికారులు పులులు కాదని కొట్టేస్తున్నారు. 

ఆదివారం నాడు  చిరుత పులులు దుప్పిని వేటాడి చంపాయని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి దాన్ని కాల్చి బూడిద చేశారని,  సోమవారం రోజున రెండు చిరుతపులులు ఒక రైతు పొలంలకు వచ్చి తిరిగినట్టు పొలంలో ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ అటవీ శాఖ  అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.  పొలాల వద్దకు వెళ్లాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వచ్చి పెద్దపులుల, చిరుతపులుల అని గుర్తించాలని రైతులు గ్రామస్తులు  అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.