శ్రీవాణి ట్రస్టు పై శ్వేత పత్రం విడుదల చేసిన టీటీడీ

శ్రీవాణి ట్రస్టు పై శ్వేత పత్రం విడుదల చేసిన టీటీడీ

తిరుమల: మే 31 ,2023 వరకు శ్రీవాణి ట్రస్టుకు 861 కోట్లు నిధులు వచ్చాయి. వివిధ బ్యాంకుల్లో 602.60 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. ఎస్.బి ఖాతా క్రింద రోజూవారీ వచ్చే డబ్బు 139 కోట్లు వివిధ బ్యాంకుల్లో ఉంది. డిపాజిట్లు పై వడ్డీ రూపంలో 36.50 కోట్లు వచ్చింది. దేవాలయాలు నిర్మాణం, పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి ఇప్పటిదాకా 120.24 కోట్లు ఖర్చు చేశాం. రాజకీయ లబ్ధి కోసం శ్రీవాణీ ట్రస్ట్ పై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ పై ఆరోపణలు చేసినవారిపై న్యాయసలహా తీసుకొని కచ్చితంగా కేసులు పెడతాం.

టిటిడిలో ఎంతటి వాడైన అవినీతి చేయడానికి భయపడాల్సిందే...తప్పు చేస్తే శిక్ష తప్పదు అది నేనైనా సరే. ఏపీతో సహా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలలో 127 ప్రాచీన ఆలయాల పునరుద్ధరణకు 139 కోట్లు కేటాయించాము. భజన మందిరాలు, ఎస్సీ, ట్రైబల్ ప్రాంతాలలో 2,273 ఆలయాల నిర్మాణానికి పూనుకున్నాము. ఇందు కోసం 227 కోట్ల 30 లక్షలు కేటాయింపులు జరిగాయి. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై ఎటువంటి అనుమానాలు వున్నా నేరుగా టీటీడీ ని సంప్రదించవచ్చు.

టీటీడి ఛైర్మన్ సుబ్బారెడ్డి