నమ్మించి... మోసం చేసి....!!

నమ్మించి... మోసం చేసి....!!
  • పథకం ప్రకారం మహిళ హత్య
  • కేసును ఛేదించిన పోలీసులు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: మహిళ ఒంటిపై ఉన్న నగలను కాజేసేందుకు ఆమెను నమ్మించి మోసం చేసి చివరకు హతమార్చిన సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి లో జరిగింది. హత్య జరిగిన 36 గంటల లోపు పోలీసులు ఈ కేసీను ఛేదించారు.  జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి హత్య వివరాలను బుధవారం సాయంత్రం వెల్లడించారు.  రామారెడ్డి మండలం అన్నారం గ్రామ వాసి నర్సవ్వ (36)  ఈ నెల 15న పని మీద కామారెడ్డి కి వచ్చి తిరిగి వారి ఇంటికి రాలేదని మేనల్లుడి దరఖాస్తు  మేరకు కామారెడ్డి పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ దర్యాప్తులో కామారెడ్డి   ఎస్పీ బి. శ్రీనివాస రెడ్డి సూచనలతో డిఎస్పీ సురేశ్ ప్రత్యక్ష్య  పర్యవేక్షణలో కామారెడ్డి పట్టణ  ఇన్స్పెక్టర్ నరేష్, CCS  CI మల్లేష్, SI-ఉస్మాన్ కలిసి బృందాలుగా ఏర్పడి జరిగిన మిస్సింగ్ అయిన ప్రదేశం నుండి సిసి కెమరాలను పరిశీలించగా మిస్సింగ్ మహిళ తో పాటు మరో ఆడ, మగలను సిసి టివి లో గుర్తించి,  ఆడ మనిషి, మగ మనిషి ఆచూకీని వెతికి బుధవారం గుర్తించి పట్టుకొని విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నారు. వీరిని గంభీరావుపేట్ మండలం రాజుపేట్ గ్రామానికి చెందిన  ఆస ప్రశాంత్ (30), అతని భార్య  ఆస సుకన్యాలుగా గుర్తించారు.

పథకం ప్రకారం హత్య 
వీరిద్దరూ భార్యాభర్తలు, వారికి పరిచయస్తుడైన ధర్ణి యెల్లయ్యతో కలిసి  నర్సవ్వ ఒంటిపై ఉన్న బంగారు నగలను కాజేయలని ముందుగా  ఆమెను చంపి ఆమె ఒంటి పై గల బంగారు అబరణాలను దొంగిలిద్దమనుకొని పధకం పన్నారు.
 
ఈ నెల 15న రామారెడ్డి లో ప్రశాంత్ ఇంట్లో అందరూ కలిసి ఉదయం కల్లు తాగి, తరువాత యెల్లయ్య నర్సవ్వను అక్కడే బలవంతంగా అనుభవించాడు. తరువాత నర్సవ్వ యెల్లయ్య ను కొన్ని డబ్బులు అప్పు కావాలని అడుగగా సాయంత్రం ఇస్తానని నమ్మించారు. తరువాత నర్సవ్వ కామారెడ్డికి బంధువు హాస్పిటల్ లో ఉంటే చూడడానికి రాగా, కొద్దిసేపటికి ప్రశాంత్, సుకన్యా కామారెడ్డి కి వచ్చి నర్సవ్వ ని కలిసి వారి ఇంటికి రామారెడ్డి తీసుకొని వెళ్ళి, వారి ఇంట్లో మెడకు తాడుతో చుట్టి గట్టిగా గుంజగా నర్సవ్వ ఊపిరి ఆడక చనిపోయింది. తరువాత తన ఒంటి మీద గల  పూస్తేల తాడు, కమ్మలు, మాటీలు, ముక్కుపుడక, పట్టగొలుసులు దొంగిలించినారాని వారు చేసిన నేరంను ఒప్పుకున్నారు.  శవం దొరకొద్దని నర్మల కాలువలో పడవేసినమని చెప్పగా వారితో పాటుగా వెళ్ళి నర్మల కాలువలోని  శవాన్ని గుర్తించి పంచనామా చేయించారు.

నేరస్తుల వద్ద నుండి పూస్తేల తాడు,  కమ్మలు, మాటీలు,  ముక్కుపుడక, పట్టగొలుసులు సుమారు రూ.2 లక్షల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు చేధనలో కామారెడ్డి ఇన్స్పెక్టర్  P.నరేశ్, CCS CI మల్లేశ్ గౌడ్, టౌన్ SI అహ్మెద్,  CCS SI ఉస్మాన్, ASI కళాధర్ రాజు,  CCS సిబ్బంది, గణపతి, రాజేంధర్, స్వామిలను ఎస్పీ అభినందిస్తూ తగిన రివార్డులు అందజేశారు.