రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దే

రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దే

ముద్ర, నంగునూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో మొదటగా రైతులకు రుణమాఫీ చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేనని వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు ఎండి ఇమ్రాన్ అన్నారు. శనివారం నాడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై యస్ రాజశేఖర రెడ్డి గారి 78వ జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో నంగునూరు, మగ్దుంపురులో  విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఘనత వై యస్ ఆర్ కె దక్కింది అన్నారు.  రైతు సంక్షేమనికి పెద్దపీట వేసి ఆదుకున్నా వైస్సార్ ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఆరోగ్య శ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం  అందించి ఎన్నో ప్రాణాలు కాపాడిన ఘనత వైస్సార్ కు  దక్కిందనన్నారు. రైతులకు సాగునీరు అందించేయందుకు జలయజ్ఞం కార్యక్రమంలో అనేక ప్రాజెక్టులు కట్టి నీరు అందించిన ఘనత వైస్సార్ గారిది  అని అన్నారు.

ఈ కార్యక్రమంలో  అశోక్,  ఏళ్ల తిరుపతి రెడ్డి ,బడుగు సదానందం, వి రాజిరెడ్డి, పలేపు కనకయ్య గౌడ్, యెస్,శివశంకర్, నగేష్, నవీన్, గోనెపల్లి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.