పోలీస్ స్టేషన్ కే రక్షణ కరువు

పోలీస్ స్టేషన్ కే రక్షణ కరువు
  • స్వాధీనం చేస్తున్న 70 కిలోల  గంజాయి మాయం
  • వివాదాస్పదంగా సారంగాపూర్ పోలీస్ స్టేషన్

సారంగాపూర్ ముద్ర: ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు శాంతి భద్రత పరిరక్షణలో ముందుండే పోలీస్ స్టేషన్ కె రక్షణ కరువైంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిని రక్షక బఠా నిలయం నుండి మాయమవడం జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించింది. విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న  పట్టించుకోకపోవడం సారంగాపూర్ పోలీస్ స్టేషన్ వివాదాస్పదంగా మారుతుంది. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో ప్రైవేట్ అంబులెన్స్ లో విశాఖ పట్టణం నుండి  సారంగాపూర్ మీదుగా రాజస్థాన్ రాష్ట్రానికి  తరలిస్తుండగా సారంగాపూర్ పోలీసులు అనుమానం వచ్చి అంబులెన్స్ తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోని నలుగురు వ్యక్తులను రిమాండ్ కు తరలించారు. సాక్షాత్తు రక్షకభట నిలయం కోట్లాది రూపాయల నుండి విలువైన గంజాయి మాయమవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అన్న చందంగా  పోలీసుల వ్యవహార శైలి ఉందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లోని అంబులెన్స్ అద్దాలను పగలగొట్టి అంబులెన్స్ లోని 70 కిలోల గంజాయిని మాయమవడం పట్ల పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అని చర్చ జోరుగా జరుగుతుంది. 

గంజాయి కాకుండా బీర్పూర్ మండలం నుండి జగిత్యాల పట్టణం నిత్యం వందలాది ఇసుక ట్రాక్టర్లతో పాటు టిప్పర్లు ప్రతిరోజు రాత్రి జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. గత వారం క్రితం బీర్పూర్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్ సారంగాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పల్లి గ్రామానికి చెందిన పుట్ట గణపతి అనే వ్యక్తిని రాత్రి సమయంలో అతివేగంగా నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడుపుతూ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. 

మైనర్ బాలురు సైతం అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా అతివేగంగా వాహనం నడుపుతూ వాహనదారులకు భయాందోళన గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సారంగాపూర్ పోలీస్ స్టేషన్ పోలీసు డాగ్ తో ప్రధాన రహదారి వెంబడి సీసీ ంచి అనుమానితుల కొరకు పోలీసులు వెతుకుతున్నారు.సారంగాపూర్ పోలీస్ స్టేషన్లోని గంజాయి మాయంపై జిల్లా ఉన్నత అధికారులు మండలంలోని గ్రామాల్లో సీసీ ఫుటేజ్ లను పరిశీలించి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.